సీఎం సహాయ నిధికి ఏడీసీసీ విరాళం రూ. 1.75 కోట్లు

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా ఆదిలాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఏడీసీసీ) ఉద్యోగులు రూ. కోటీ 73 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దీంతోపాటు లాక్‌డౌన్‌తో పనులులేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలను ఆదుకోవడానికి బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది తమవంతుగా రూ. 60 వేల విలువైన నిత్యావసర వస్తువులను మావల మండలంలోని బట్టిసావర్‌ గ్రామంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ భూమారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల అనేక మంది ఉపాధికోల్పోయి పూటగడవని స్థితిలో ఉన్నారని చెప్పారు. అలాంటి వారికి సహకారం అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.