కొవిడ్-19 వ్యాధి గురించి నిమిషం కూడా గ్యాప్ లేకుండా టీవీల్లో చెబుతూనే ఉన్నారు. బయటకు వెళ్తే పోలీసులు గుంజీలు, జంపింగ్స్ లాంటి పనిష్‌మెంట్లు ఇచ్చి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా జనాలు బయటకు వెళ్తూనే ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు తమవంతు ప్రయత్నం చేయక మానలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనాపై అవగాహన కల్పించేందుకు కర్నూల్‌కు చెందిన సబ్ఇన్స్పెక్టర్ మారుతీ శంకర్ వినూత్నపంతా ఎంచుకున్నాడు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించేందుకు ఓ గుర్రానికి కరోనా వైరస్‌ను పెయింటింగ్‌గా వేయించాడు. ఇదంతా వైరస్‌పై అవగాహన కోసమే అంటున్నాడు పోలీస్. ఈ ప్రచారాన్ని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొందరేమో.. నోరులేని జీవాన్ని ఇలా హింసించడం సరైనది కాదని కామెంట్లు పెడుతున్నారు.
గుర్రమెక్కిన పోలీస్.. కరోనాపై అవగాహన